ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభం - ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తాజా సమాచారం

ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదలకు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించేందుకు కేటాయించిన వాహనాలను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు.

Ration vehicles
రేషన్ పంపిణీ వాహనాలను

By

Published : Jan 21, 2021, 1:57 PM IST

విజయనగరం జిల్లాలో ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేసే వాహనాలను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. నగరంలోని పోలీసు శిక్షణా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో... ఆయనతో పాటు కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లాకు మంజూరు చేసిన 458 వాహనాలను జెండా ఊపి ఆరంభించారు. లబ్ధిదారులు సరుకులు తీసుకువెళ్లేందుకు కేటాయించిన జ్యూట్ సంచులను ఆవిష్కరించారు. అనంతరం వాహనాలు ప్రదర్శనగా ఆయా మండల కేంద్రాలకు బయలుదేరాయి.

ABOUT THE AUTHOR

...view details