ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికకు 'గర్భం'.. నిందితుడిపై కేసు - vizianagaram dst latest rape cases news

బాలికను బెదిరించి విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన నాగారాజు అనే యువకుడు అత్యాచారం చేశాడు.ఫలింతగా బాలిక గర్భం దాల్చటంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై బొబ్బిలి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

rape on minor girl in  vizianagaram dst chipurapali
rape on minor girl in vizianagaram dst chipurapali

By

Published : Jun 2, 2020, 5:12 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, బొబ్బిలి డీఎస్పీ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలికను చింతపల్లి నాగరాజు అనే యువకుడు అసభ్యంగా ఫొటోలు తీశాడు.

ఆమెను బెదిరించి ఆరేడుసార్లు అత్యాచారం చేశారు. కొన్నాళ్లకు తల్లిదండ్రులు అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు వైద్యులు ధృవీకరించారు. అప్పుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఆ బాలిక చెప్పగా.. వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై.. సెక్షన్ 376 కింద కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details