రామతీర్థం హుండీ ఘటన: ఇద్దరిపై సస్పెన్షన్ వేటు - Ramatirtham temple issue

15:21 March 19
రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం ఘటన
విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విశాఖ డీసీ సుజాత, విజయనగరం సహాయ కమిషనర్ రంగారావులపై సస్పెన్షన్ వేటు చేశారు. ఈ నెల 17న హుండీ లెక్కింపు సందర్భంగా సుజాత వాహన డ్రైవర్ చేతివాటం ప్రదర్శించి..బంగారు శతమానం, రూ.3 వేలు దొంగిలించాడు. నగదు లెక్కింపు చోటుకు డ్రైవర్‌ను రానిచ్చిన డీసీపై దేవదాయశాఖ వేటు వేసింది. పర్యవేక్షణ లోపం వల్ల విజయనగరం సహాయ కమిషనర్ రంగారావు సస్పెన్షన్కు గురయ్యారు.
ఇదీ చదవండి: