Ramatheertham Temple: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండరామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్‌లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆలయాన్ని పునఃనిర్మించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గైర్హాజరయ్యారు.
Ramatheertham Temple: రామతీర్థం కోదండ రామాలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ - నెల్లిమర్ల మండలంలో రామతీర్థం కోదండరామాలయం
Ramatheertham Temple: రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై నిర్మించిన కోదండరామ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గైర్హాజరయ్యారు.
రామతీర్థంలో కోదండ రామాలయం ప్రారంభోత్సవం