రామతీర్థం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని విజయనగరం ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. సాంకేతిక, భౌతిక ఆధారాల కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్న ఆమె.. ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. 5 బృందాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడిపైనా కేసు నమోదు చేశామన్నారు.
రామతీర్థం ఘటనలో 20 మందిని అదుపులోకి తీసుకున్నాం: విజయనగరం ఎస్పీ - విజయనగరం న్యూస్
రామతీర్థం ఘటన దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
రామతీర్థం ఘటనలో 20 మందిని అదుపులోకి తీసుకున్నాం: విజయనగరం ఎస్పీ