విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద రామచంద్ర పేట రైతులు నిరసన తెలిపారు. తమ భూముల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారి భూములకు సంబంధించిన పత్రాలను చూపించారు. గతంలో పని చేసిన అధికారులు వన్ బీ, అడంగల్ పేర్లు మార్చి యాజమాన్యానికి భూములు అప్పగించారని ఆరోపించారు.
తమ భూముల్లో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని రైతుల నిరసన - bhogapuram latest news
తమ భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని విజయనగరం జిల్లా రామచంద్ర పేట గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ సందర్భంగా భోగాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
తమ భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని రామచంద్ర పేట రైతుల నిరసన