విశాఖ రాజధాని ప్రతిపాదనకు మద్దతుగా వైకాపా ర్యాలీ - విజయనగరంలో ర్యాలీలు విశాఖ రాజధానికి మద్దతుగా
విశాఖను రాష్ట్ర రాజధానిగా ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు మద్ధతుగా వైకాపా శ్రేణులు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాయి. నగరంలోని కోట కూడలి నుంచి గంటస్తంభం వరకు భారీ ర్యాలీలో నేతలతో పాటుగా పెద్దఎత్తున కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ... థ్యాంక్యూ సీఎం అంటూ ప్లయింగ్ కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విశాఖను కార్యనిర్వహక రాజధానిగా ప్రతిపాదించటం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ ప్రాంతానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి, తెదేపా నాయకుడు అశోక్ గజపతి రాజు విశాఖ రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడం బాధాకరమన్నారు.
విశాఖ రాజధాని ప్రతిపాదనకు మద్దతుగా ర్యాలీలు
.