ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుభరోసా పథకంలో అవకతవకలు - రైతుభరోసా పథకం న్యూస్

రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో పలుచోట్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. భూయజమానులకు తెలియకుండానే నకిలీ కౌలుదారుల ఖాతాలు సృష్టించి... రైతుభరోసా నిధులు బొక్కేస్తున్నారు. దీనివల్ల అర్హులైన వారికి డబ్బులందక లబోదిబోమంటున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బలిజపేట మండలంలో రైతుభరోసా సొమ్ములు పక్కదారి పట్టడంపై ప్రత్యేక కథనం.

raithu-bharosa

By

Published : Nov 19, 2019, 9:54 AM IST

రైతుభరోసా పథకంలో అవకతవకలు

విజయనగరం జిల్లావ్యాప్తంగా 2 లక్షల 84వేల 483 రైతు కుటుంబాలు... రైతుభరోసా పథకానికి అర్హులుగా అధికారుల లెక్కలు తేల్చాయి. బలిజపేట మండలంలో గ్రామస్థాయి అధికారులతో చేతులు కలిపిన కొందరు నాయకులు... నకిలీ కౌలు రైతుల ఖాతాలను సృష్టించి డబ్బులను పక్కదారి పట్టించడం ప్రారంభించారు. మండలంలోని ఒక్క నారాయణపురంలోనే 88మంది అనర్హులను కౌలుదారులుగా సృష్టించి... రైతుభరోసా సొమ్ములు స్వాహా చేశారు.

అనర్హుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని... తమకు మాత్రం చిల్లిగవ్వ అందలేదంటూ కొందరు అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపురం వీఆర్వోకు తెలియకుండానే అనర్హులను జాబితాలో చేర్చారని... ఈ అంశంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని బలిజపేట తహశీల్దార్‌ గణపతిరావు అంటున్నారు.

బలిజపేట మండలంలో వెలుగుచూసిన అక్రమాలపై లోతైన విచారణ జరిపించి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

దశాబ్దాలుగా గ్రామస్థుల్ని వేధిస్తున్న బోదకాలు వ్యాధి

ABOUT THE AUTHOR

...view details