విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 93 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అమరావతి నుంచి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్నారు. గరివిడి, గుర్ల, మెరకముడిదాం, చీపురుపల్లి మండలాల్లో 93 కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.
రైతుభరోసా కేంద్రాలు రెండు రకాలు. ఒకటి రైతులకు వనరులు అందజేసిన కేంద్రం. రెండోది రైతులకు విజ్ఞానం వివరించే కేంద్రం. ఎప్పుడు ఏ పంటలు వేయాలి... అధిక ఉత్పత్తులు ఎలా రాబట్టాలి... గిట్టుబాటు ధర ఎలా తెచ్చుకోవాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధించాలి అనే విషయాలను వివరిస్తారు.