బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరంజిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 27.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తవలసలో 60.8 మిల్లీమీటర్లు, పూసపాటిరేగలో 54.6, గుర్లలో 52.8, నెల్లిమర్లలో 43.8., మెరకముడిదాంలో 38.4, పార్వతీపురం, లక్కవరపుకోటలో 34.8, డెంకాడలో 37.2, తెర్లాంలో 36.2, భోగాపురంలో 33.6, వేపాడలో 32, విజయనగరంలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో వేటకు వెళ్ళొద్దనిమత్స్యకారులకుఅధికారులు సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ హరి జవహర్లాల్... తనకార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. సమస్యలు ఉంటే 08922 -236947 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని ప్రకటించారు. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లోనూ సహాయక కేంద్రాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూం ఏర్పాటు - ఏపీలో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం... కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.
విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు