ఈదురుగాలుల ధాటికి అరటితోట ధ్వంసం - rain
రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లా గాదిపల్లిలో ఈదురుగాలుల ధాటికి అరటితోటలు ధ్వంసం అయ్యాయి. రైతులు పూర్తిగా నష్టపోయామంటూ భోరుమంటున్నారు.
nastam
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గాదిపల్లిలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటితోట ధ్వంసమైంది.గాలులు బలంగా వీచిన కారణంగా...అరటిచెట్లు ఎక్కడికక్కడ నేలకొరిగాయి.దీంతో తాము పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.