ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రం.. పూర్తిగా ఇంటి వాతావరణం!

క్వారంటైన్ కేంద్రాలంటే భయపడుతున్నారా..! ఒక్కసారి విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను చూస్తే మీరు ఈ మాట అనటం మానేస్తారు. ఎందుకంటే అక్కడి కేంద్రాలు ఇంటి వాతావారణాన్ని తలపిస్తున్నాయి.

By

Published : Apr 19, 2020, 6:00 PM IST

Quarantine centers looks like home environment at vizianagaram
Quarantine centers looks like home environment at vizianagaram

ఇంటి వాతావరణాన్ని తలపిస్తున్న క్వారంటైన్​ కేంద్రాలు

విజయనగరంలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రాలు ఇంటి వాతావ‌ర‌ణాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. 4,302 ప‌డ‌క‌ల‌ను సిద్దం చేశారు. జిల్లాలో ఇప్పటివ‌ర‌కు 279 మందిని క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించారు. వీరిలో దాదాపు 100 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారని, ప్రస్తుతం 179 మంది క్వారంటైన్ కేంద్రాల్లో సుర‌క్షితంగా ఉన్నారని క్వారంటైన్ ప్రత్యేకాధికారిణి బాలా త్రిపుర సుంద‌రి చెప్పారు. క‌లెక్టర్ ఆదేశాల మేర‌కు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రోజూ గ‌దుల‌ను సోడియం హైపో క్లోరైడ్‌తో శుభ్రప‌రుస్తున్నామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details