ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం

By

Published : Feb 19, 2021, 6:11 PM IST

మద్యాహ్న భోజన పథకంలో భాగంగా.. ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలోని ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ సమస్యను కురుపాం పస్ట్​క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

Quality defect in school lunch scheme in Vizianagaram district Kurupam
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం

విజయనగరం జిల్లా కురుపాంలోని పలు పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం అధ్వానంగా మారింది. ఇటీవల ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో భోజనం చేసేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఈ సమస్యను పర్యవేక్షించాల్సిన అధికారులే చోద్యం చూస్తుండడంతో విద్యార్థులకు శాపంగా మారింది. విషయాన్ని కురుపాం పస్ట్​క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి:

'తెదేపాకు ఓటు వేస్తామన్నందుకు.. కరెంటు తీసేశారు'

ABOUT THE AUTHOR

...view details