ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరికొన్ని గంటల్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - పైడితల్లి అమ్మవారి ఉత్సవం వార్తలు

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మరి కొన్ని గంటల్లో జరగనుంది. పైడితల్లి సిరిమానోత్సవం రాష్ట్ర పండుగగా జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం

By

Published : Oct 27, 2020, 12:39 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా సిరిమానోత్సవానికి మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తుకు 2116మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియామించారు. అదేవిధంగా.. సిరిమాను తిరిగే ప్రధాన మార్గంలో 45 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి ఉదయం 11 గంటల నుంచి భక్తులకు అనుమతి నిషేధించారు. విజయనగరంలో దుకాణాలన్నీ పూర్తిగా మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలోకి వచ్చే వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. అంతర్రాష్ట్ర, జిల్లా, మండల సరిహద్దుల్లో 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే, అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details