విజయనగరం జిల్లా సాలూరులో మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు భిన్నంగా శిక్ష విధిస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించకుండా జనసమూహంలో తిరుగుతున్న వారిని ఆపి 'మాస్కులు లేకుండా బయటకు రాము' అని వంద సార్లు రాయిస్తున్నారు. పట్టంణంలోని బోసు బొమ్మ జంక్షన్ వద్ద ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొని..ముఖ కవచం లేని వారికి ఈ విధంగా శిక్ష విధించారు.
మాస్క్ లేకుండా బయటకు వచ్చారా..ఈ శిక్ష తప్పదు..! - punishment for no mask news
కొవిడ్ నియంత్రణకు అధికార యంత్రాంగం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ కొంతమంది ప్రజలు జాగ్రత్తలు పాటించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలకు వారి బాధ్యత గుర్తు చేసేందుకు విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు.
విజయనగరంలో మాస్కు లేనివారికి శిక్ష