ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేం చెబితే విమర్శించారు.. కాగ్ అదే చెప్పింది: పయ్యావుల కేశవ్ - tdp news

Payyavula Keshav Fire on AP Government: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి కాగ్ నివేదిక ఏం చెప్పిందో తెలుసా అంటూ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్ఫోటం దిశగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పెరిగిపోయిన తలసరి ఆదాయం గురించి, అప్పుల వివరాల గురించి కాగ్ పలు కీలక విషయాలను నివేదకలో పేర్కొంది అని ఆయన తెలిపారు.

payyavula keshav
payyavula keshav

By

Published : Mar 24, 2023, 4:45 PM IST

Payyavula Keshav Fire on AP Government: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి కాగ్ నివేదిక ఏం చెప్పిందో తెలుసా అంటూ.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్ఫోటం దిశగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆయన మీడియా ముందు పలు కీలక విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో పెరిగిపోయిన తలసరి ఆదాయం గురించి, అప్పుల లెక్కల వివరాల గురించి కాగ్ పలు సంచలన విషయాలను తన నివేదికలో పేర్కొంది అని ఆయన తెలిపారు.

విస్పోటం దిశగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ..ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

''విస్ఫోటం దిశగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉందని కాగ్ చెబుతోంది. తలసరి అప్పు భారీగా పెరిగిపోయిందని తేటతెల్లమైంది. ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో చేసిన అప్పుల పద్దును ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించట్లేదు. దాదాపు రూ.1.18 లక్షల కోట్ల అప్పును ఈ ప్రభుత్వం చూపించలేదు. తప్పకుండా చెల్లించాల్సిన బకాయిలను పద్దుల్లో చూపలేదు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.480 కోట్లు దారి మళ్లించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను ఖాతాల్లో చూపించకపోవడం నేరం. ఏ ఖాతాల్లోకి పోతున్నాయో స్పష్టత లేదు. గతంలో మేం చెబితే విమర్శించారు.. కాగ్ అదే విషయం చెప్పింది. ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలను పూర్తిగా ఈ ప్రభుత్వం ఉల్లంఘించింది'' -పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్

ప్రభుత్వం 1.18లక్షల కోట్ల ఆప్పు చేసింది: అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గురించి కాగ్ విడుదల చేసిన నివేదికను ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియా ముఖంగా చదివి వినిపించారు. కాగ్ తన నివేదికలో.. రాష్ట్ర తలసరి అప్పు భారీగా పెరిగిపోయిందని తేటతెల్లం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ దాదాపు 1.18లక్షల కోట్ల ఆప్పు చేసిందని, కానీ, ఆ అప్పును ప్రభుత్వం తన పద్దులో చూపించలేదని కాగ్ వెల్లడించిందని ఆయన దుయ్యబట్టారు.

ఆ నిధులన్నీ ఏ ఖాతాలోకి వెళ్తున్నాయి..?: అంతేకాకుండా, తప్పకుండా చెల్లించాల్సిన బకాయిలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పద్దుల్లో చూపించకుండాపోవటం దుర్మార్గమైన చర్య అని పయ్యావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ. 480 కోట్లను దారి మళ్లించిందని.. అవి ఏ ఖాతాల్లోకి పోతున్నాయో స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, ప్రాజెక్టులకు చెెందాల్సిన నిధులన్నింటిని దారి మళ్లిస్తున్నారని తాము గతంలో చెబితే తమను, తమ నాయకులను విమర్శించారంటూ పయ్యావులు గుర్తు చేశారు.

ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారు..?: ఇప్పుడు కాగ్ అదే విషయాన్ని తన నివేదికలో చెప్పింది? దీనికి ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారు? అని పయ్యావుల ప్రశ్నించారు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలను కూడా ఉల్లంఘించిందని కాగ్ తెలిపిందన్నారు. ప్రభుత్వ సంస్థల రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వ ఖాతాల్లో చూపాల్సిందేనన్నారు. ప్రభుత్వ గ్యారెంటీలను.. అప్పులను దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3-4రోజుల ముందే కాగ్ నివేదిక ప్రభుత్వానికి చేరినా సభలో పెట్టి చర్చించకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి, చివరి రోజు పెట్టారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details