విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండ దిగువన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విజయసాయిరెడ్డి వాహనంపై నిరసనకారులు రాయి విసిరారు. తెదేపా, వైకాపా, భాజపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్తుండగా.. మూడు పార్టీల శ్రేణులు ఎదురుపడ్డారు. మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయింది.
రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడి - MP Vijayasaireddy updates
విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి వాహనంపై నిరసనకారులు రాయి విసిరారు. బోడికొండ దిగువన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విజయసాయిరెడ్డి బోడికొండ నుంచి తిరిగి వెళ్తుండగా.. మూడు పార్టీల శ్రేణులు ఎదురుపడగా.. వారి మధ్య తోపులాట జరిగింది.
![రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడి protesters-attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10091670-337-10091670-1609587076096.jpg)
protesters-attack
రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడి
ఇదీ చదవండి:
Last Updated : Jan 2, 2021, 5:02 PM IST