పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ... విజయనగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కోట జంక్షన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పరీక్షల నిర్వహణ సరైంది కాదని ఏబీవీపీ నాయకులు అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని.. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామన్నారు.
పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన - protest under the auspices of ABVP news
విజయనగరం పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన