విజయనగరం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కరోనా బాధితులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రెండో దశలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా వసతులు పెంచటం లేదన్నారు.
కరోనా వైద్య పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వసతులు మెరుగుపరిచేలా, కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.