తనను విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగి నిరసన - విజయనగరం జిల్లా తాజా వార్తలు
తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు గుర్రపు శివశంకర్ డిమాండ్ చేశారు. డ్వామా కార్యాలయం ఎదుట అతను నిరసనకు దిగారు. తనపై తండ్రి, చెల్లి ఆధారపడి ఉన్నారని...మరో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని...అధికారులు న్యాయం చేయాలని కోరారు.
తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు గుర్రపు శివశంకర్ కోరారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన గుర్రపు శివశంకర్ సస్పెండ్‌కు డ్వామా కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తనకు జరిగిన అన్యాయంపై ముద్రించిన కరపత్రాన్ని ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాడు. అధికార పార్టీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేసి... డ్వామా పీడీపై ఒత్తిడి చేయటంతో తనను ఉద్యోగం నుంచి తప్పించారని వాపోయాడు. తనపై జరిగిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని కోరాడు. 2007 నుంచి 2019 ఆగస్టు వరకు నిబద్ధతతో విధులు నిర్వహించానని, సమస్యను జిల్లా అధికారులు దృష్టికి తీసుకుపోగా...తిరిగి విధుల్లోకి చేర్చుకుంటామని అన్నారే తప్ప ఉద్యోగం ఇవ్వటం లేదని విచారం వ్యక్తం చేశాడు. ఇప్పటికైన అధికారులు స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. తనపై తండ్రి చెల్లి ఆధారపడి ఉన్నారని...మరో ఉబ్బంధి లేక ఇబ్బందులు పడుతున్నామని...అధికారులు న్యాయం చేయాలని కోరారు.