విజయనగరం జిల్లా పార్వతీపురంలో రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారిలో ట్రాక్టర్లపై ర్యాలీగా ఉప కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అన్నదాతలను నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఉప పాలనాధికారికి వినతి పత్రం అందించారు.
విజయనగరంలో రైతు సంఘాల నిరసన - Protest of farmer unions news
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. విజయనగరంలోని పార్వతీపురంలో మార్కెట్ యార్డు నుంచి ఉప కలెక్టర్ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు.
రైతు సంఘాల నిరసన