విజయనగరంలోని సంతపేట శ్రీ జగన్నాథ స్వామి ఆలయ రథాన్ని పరిరక్షించాలని కోరుతూ... జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు ఆందోళన చేపట్టారు. ఆలయ రథం ఉంచే స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, రథాన్ని రోడ్డుపై ఉంచడం వల్ల భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రథాన్ని పరిరక్షించటంతో పాటు ఆలయానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రథాన్ని పరిరక్షించాలంటూ విజయనగరంలో భక్తుల ఆందోళన - విజయనగరం నేటి వార్తలు
విజయనగరం పట్టణంలోని సంతపేటలో భక్తులు ఆందోళన చేశారు. శ్రీ జగన్నాథ స్వామి వారి రథాన్ని పరిరక్షించాలని కోరారు.
రథాన్ని పరిరక్షించాలంటూ విజయనగరంలో భక్తుల ఆందోళన