విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపకేంద్రం భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల రూ. 2లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. ఇందులో భాగంగా భవనానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేశారు. తక్షణమే ఆ రంగులను తొలగించాలంటూ ఉపకేంద్రం వద్ద గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
'తక్షణమే ఆ రంగులు తొలగించండి' - జిన్నాం నేటి వార్తలు
విజయనగరం జిల్లా జిన్నాం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఉపకేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['తక్షణమే ఆ రంగులు తొలగించండి' protest-against-to-remove-primary-health-center-colors-in-jinnam-vizianagaram-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7501935-999-7501935-1591437285651.jpg)
వైకాపా జెండా రంగులను పోలిన రంగులు వేయడంపై విజయనగరం జిల్లా జిన్నాంలో ఆందోళన