కోదండరాముని ఆలయం, నీటి మడుగును పరిశీలించిన అనంతరం రామతీర్థం దేవస్థానం అధికారులతో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. అనంతరం ఆ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ.. కోదండరాముని విగ్రహం ధ్వంసం కావడంతో నూతన ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ సామగ్రి ఎంత అవసరమో.. అన్నదాంతోపాటు ఇతర అంచనాలు వేశామన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.
రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదన
విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయ పునర్నిర్మాణానికి బోడికొండను దేవాదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదన