ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్గమధ్యంలో అస్వస్థత... వలస కార్మికులది తీరని వ్యధ - విజయనగరం జిల్లాలో వలస కార్మికుల ఆందోళన

లాక్​డౌన్​తో పనులు లేక, సొంత ఊళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక వలస కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. కాలినడకన వేల కిలోమీటర్ల దూరం నడుస్తూ ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ నుంచి కోల్​కతాకు బయల్దేరిన వలస కూలీలు నేడు విజయనగరం జిల్లా భోగాపురం చేరుకున్నారు.

problems of migrant labors in vizianagaram
అస్వస్థతకు గురైన వలస కార్మికుడికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

By

Published : May 9, 2020, 8:39 PM IST

హైదరాబాద్ నుంచి కోల్​కతాకు కాలినడకన పయనమైన వలసకూలీలు విజయనగరం జిల్లా భోగాపురం చేరుకున్నారు. సుందరపేట సమీప రహదారిలో ప్రయాణిస్తున్న సమయంలో రమేష్ యాదవ్ అనే వలస కూలీ అస్వస్థతకు గురై రోడ్డు మీద పడిపోయాడు.

విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ.. బాధితునికి చికిత్స చేసి, ఓఆర్​ఎస్ ప్యాకెట్లు అందించారు. గత వారం రోజులుగా తాము నడుస్తున్నామని చెప్పడం.. వారి నిస్సహాయతను తెలియజేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details