ఇదీ చూడండి:
సకల అసౌకర్యాలకు చిరునామా.. ఈ ప్రభుత్వ పాఠశాల - vizianagaram govt school problems
విజయనగరం జిల్లా సాలూరు మండలం పెదబోరబంద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల.. సకల అసౌకర్యాలకు చిరునామాగా మారింది. ఇక్కడ మధ్యాహ్న భోజనం వండేందుకు సరైన గది లేదు. తాటాకుల షెడ్డు వేసి వంట చేయాల్సి వస్తోంది. 470 మంది విద్యార్థులకు ఒకటే మరుగుదొడ్డి ఉంది. ఇంత మందికి సరిపడా గదులు లేక.. శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పెదబోరబందలోని ప్రభుత్వ పాఠశాల