Pressure on Sanitary Secretaries: స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా సేవా రుసుం వసూళ్లకు సంబంధించి పురపాలికల్లో శానిటరీ కార్యదర్శులపై ఒత్తిడి పెరుగుతోంది. చంటిబిడ్డ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్నా.. తనను విధులకు రావాలని, పన్ను వసూలు చేయాలని చెబుతున్నారని విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలిక పరిధిలో పని చేసే కార్యదర్శి హేమలత కన్నీటిపర్యంతమయ్యారు. ఆమెతోపాటు సహచర ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు సేవా రుసుం వసూలు కాలేదని, ఏప్రిల్ ఆరోతేదీలోగా 80శాతం వసూలు కావాలని పుర కమిషనరు పి.సింహాచలం మంగళవారం ప్రత్యేక మెమో జారీ చేశారు. రోజువారీ ప్రగతి లేకపోతే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు.
చంటి బిడ్డ ఆసుపత్రిలో ఉన్నా..సేవారుసుం వసూలుకు ఒత్తిడి.. కన్నీటిపర్యంతమైన కార్యదర్శి
Pressure on Sanitary Secretaries: సేవా రుసుం వసూళ్లకు సంబంధించి పురపాలికల్లో శానిటరీ కార్యదర్శులపై ఒత్తిడి పెరుగుతోంది. చంటిబిడ్డ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్నా.. తనను విధులకు రావాలని... పన్ను వసూలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు విజయనగరం జిల్లాకు చెందిన కార్యదర్శి కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి వేళల్లోనూ పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో తమ ఆవేదన తెలియజేసేందుకు పలువురు కార్యదర్శులు బుధవారం సబ్‌కలెక్టర్ భావన వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కమిషనరు నుంచి పిలుపు రావడంతో వెళ్లి సమస్యను విన్నవించారు. 80శాతం లక్ష్యాన్ని 70శాతం చేస్తామని.. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, తప్పనిసరి చేయాలని ఆయన ఆదేశించారు. రాత్రి వేళల్లోనూ పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కమిషనర్ సింహాచలం వివరణ కోరగా విధుల నుంచి తొలగిస్తామంటే ఉద్యోగాల నుంచి తొలగించడం కాదని... వారి బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:electricity charges : అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు పెంచేశారు