ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తుంటే సొంత వారే విమర్శించడం సరికాదని శత్రుచర్ల పరీక్షిత్ రాజు పేర్కొన్నారు. అర్హులైన వారు ఉంటే పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు తప్పకుండా అందించాలని అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారన్నారు. ఉపముఖ్యమంత్రి నెలలో 25 రోజులు నియోజకవర్గంలోనే ఉంటున్నారని.. కరోనా సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంతంగా వంట చేసి పేదలకు భోజనాలు అందించారని పరీక్షిత్ రాజు గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్న.. తీరుతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
'రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు' - satrucharla parikshithraju latest comments
సంక్షేమ పథకాలు అందించడంలో రాజకీయాలు చేయడం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు వైకాపా అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు.
!['రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు' satrucharla parikshithraj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7491327-570-7491327-1591370252557.jpg)
అరుకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు