విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపుదుంగాడ గిరిజన గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్బిణులకు అవస్థలు తప్పటం లేదు. గ్రామానికి చెందిన సుమిత్ర అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా... భర్త సన్యాసిరావు, బంధువులు కలసి డోలీతో 12కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దబ్బగుంట వరకు వచ్చారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఎస్. కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. రహదారి లేకపోవడం వల్లే గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని సన్యాసిరావు వాపోతున్నారు.
గిరిజన ప్రాంతాల్లో లేని రోడ్లు.. నిత్యం గర్భిణులకు తిప్పలు - pregnant women problems at vizianagaram news
ఆసుపత్రికి 20కిలోమీటర్ల దూరం, వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు... ఈ పరిస్థితుల్లో గర్భిణీ ప్రసవ వేదన పడుతుంటే ఆ బాధ వర్ణణాతీతం. విజయనగరం జిల్లాలోని పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది. కుటుంబసభ్యులు డోలీతో ఆసుపత్రికి తరలించారు.
![గిరిజన ప్రాంతాల్లో లేని రోడ్లు.. నిత్యం గర్భిణులకు తిప్పలు pregnant women faces lot of problems at vizianagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5602314-778-5602314-1578222188167.jpg)
విజయనగరం జిల్లాలో గర్భిణుల అవస్థలు