ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్​లోనే ప్రసవం.. తల్లీ, బిడ్డా క్షేమం - pregnant delivery in vijayanagaram district

అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఓ గర్భిణి ప్రసవించి... పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

PREGNANT LADY DELIVERY IN AMBULANCE VIJAYANAGARAM DISTRICT
PREGNANT LADY DELIVERY IN AMBULANCE VIJAYANAGARAM DISTRICT

By

Published : Jun 30, 2021, 12:56 PM IST

గిరిజన ప్రాంతానికి చెందిన ఓ మహిళ 108 వాహనంలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ గ్రామానికి చెందిన జీలకర్ర మనీషాకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి.

వాహన సిబ్బంది ప్రసవం చేయగా.. మనీషా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అందించి తల్లీ బిడ్డను కురుపాం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 108 సిబ్బందిని గర్భిణి బంధువులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details