గజపతినగరం మండలం మరుపిల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పరిశీలించారు. విద్యార్థులకు తాగునీటి సదుపాయం సరిగ్గా లేకపోవడం, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సప్లై కల్పించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలను కల్పించి, ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు.
అవసరమైతే గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలలను సందర్శించి సరిపోల్చుకోవాలని, వాటికి మించిన రీతిలో వసతులను కల్పించి తీర్చిదిద్దాలని అధికారులకు ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీశారు. పేరెంట్స్ కమిటీతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుక, యూనిఫారాలపై వాకబు చేశారు.