అర్థరాత్రి,అంబులెన్స్‌లోనే ప్రసవం - LANGI
విజయనగరం జిల్లా కొండ శిఖర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ, అర్ధరాత్రి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది.

అంబులెన్స్‌లోనే ప్రసవం
అంబులెన్స్‌లోనే ప్రసవం
విజయనగరం జిల్లా కొండ శిఖర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ, అర్ధరాత్రి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. కొమరాడ మండలం లాంగీ గ్రామానికి చెందిన మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండగా మండలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి 108 వాహనంలో చాందినినీ మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆస్పత్రి సమీపంలో, ఆ వాహనంలోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి తల్లి బిడ్డను ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించారు.