విజయనగరం జిల్లా వేపాడలో వైకాపా వర్గపోరుతో ఎంపీపీ ఎన్నిక(mpp-elections) వాయిదా పడింది. ఎన్నిక నిర్వహిస్తున్న సమావేశ మందిరంలోకి చొరబడిన వైకాపా తిరుగుబాటు వర్గం నాయకులు రిటర్నింగ్ అధికారి నుంచి పత్రాలు లాక్కున్నారు.
తిరుగుబాటు వర్గం చర్యతో సమావేశ మందిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.