విజయనగరం జిల్లా బొబ్బిలి చరిత్రపై తపాలాశాఖ దృష్టి సారించింది. సంస్కృతి, చారిత్రక కట్టడాలు, బొబ్బిలి యుద్ధం, తాండ్ర పాపారాయుడి నేపథ్యం, వేణుగోపాల స్వామి చరిత్రను వెలికితీయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తపాలాశాఖ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు బొబ్బిలి, సాలూరు ఇన్‌స్పెక్టర్లు ఆ సమాచారాన్ని సేకరించారు. బొబ్బిలి వీణపై తపాలా కవరును ఈ నెల 14న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆవిష్కరించనున్నారు. మరి కొన్నింటినీ గుర్తించి వాటిని కవర్లపై ముద్రించేందుకు చరిత్రను సేకరిస్తున్నారు. స్థానికంగా విరాళాలు అందించేందుకు ముందుకొచ్చే వ్యక్తులను గుర్తించాలన్న ఆదేశాలతో అన్వేషణలో పడ్డారు. ఆవిష్కరించిన కవర్లను దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో ప్రదర్శిస్తారని, ప్రస్తుత తరానికి తపాలాశాఖ చేరువయ్యేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని తపాలాశాఖ ఇన్‌స్పెక్టర్లు చెప్పారు.
bobili history: బొబ్బిలి చరిత్రపై తపాలాశాఖ దృష్టి..
బొబ్బిలి చరిత్రపై తపాలశాఖ దృష్టి పెట్టింది. అక్కడి చరిత్రను వెలికితీయాలని ఆదేశాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
బొబ్బిలి చరిత్రపై తపాలాశాఖ దృష్టి
ఇదీ చదవండి: CUSTARD APPLE : గిరిపుత్రుల కష్టం.. దళారుల పాలు