ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికపై అత్యాచారం.. ఆర్మీ ఉద్యోగిపై పోక్సో కేసు - విజయనగరంలో ఆర్మీ ఉద్యోగిపై పోక్స్ కేసు

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ ఉద్యోగి, అతని స్నేహితుడిపై కేసులు నమోదయ్యాయి. ఆర్మీ ఉద్యోగిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అవ్వగా, అతని స్నేహితుడిపై దిశ కేసు నమోదు చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ పాపారావు తెలిపారు.

Posco act case
Posco act case

By

Published : Nov 7, 2020, 10:27 PM IST

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్మీ ఉద్యోగి స్నేహితునిపై కూడా పోలీసులు దిశ కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పాపారావు తెలిపిన వివరాల మేరకు... దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి సాయికుమార్ గత నెల 23వ తేదీన జమ్మూ కశ్మీర్ నుంచి గ్రామానికి వచ్చాడు.

అదే గ్రామానికి చెందిన బాలికతో స్నేహం చేసి, మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆర్మీ ఉద్యోగిపై పోక్సో చట్టం కింద, అతని స్నేహితునిపై దిశ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details