విజయనగరం పైడితల్లి దేవస్థానం అభివృద్ధికి అంతా కట్టుబడి ఉందామని ఆలయ పాలక మండలి ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన పైడితల్లి దేవస్థానంతో పాటు రామలింగేశ్వరస్వామి ఆలయం, జగన్నాథస్వామి ఆలయ పాలక మండలి సభ్యులతో అశోక్ గజపతిరాజు సమావేశమయ్యారు.
ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలి
ఎంతో ప్రతిష్ట సంతరించుకున్న పైడితల్లి దేవస్థానం అభివృద్ధి విషయంలో సభ్యులు ఇచ్చిన ప్రతి సూచనను పరిశీలించి.. అనుకూలంగా ఉంటే తప్పక తన వంతు సహకారం అంగీకారం అందిస్తానని అశోక్ గజపతి రాజు అన్నారు. ఆలయ విస్తరణ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగే విధంగా కృషి చేయాలని సభ్యులకు సూచించారు. పాలక మండలి నియామకం అయిన ప్రతి ఆలయం అభివృద్ధికి.. అక్కడి ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిదన్నారు. అనవసర ఖర్చులను తగ్గించాలని సూచించారు. సభ్యులు దేవుని సేవకులు పనిచేసి.. భక్తుల మన్ననలు అందుకోవాలన్నారు.
ఇదీ చదవండి :భోగాపురం నిర్వాసితుల నెత్తిన "బండ"... అనువుగా లేని ఇళ్ల స్థలాలతో అవస్థలు