ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈదురుగాలులు.. నేలకొరిగిన పూరిళ్లు - కురుపాం తాజా సమాచారం

కురుపాం నియోజకవర్గంలో శుక్రవారం ఈదురుగాలు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పూరిళ్లు దెబ్బతిన్నాయి. ఓ ఇంట్లో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

poor houses were damaged by heavy rain and storm in vijayanagaram district
ఈదురుగాలులకు దగ్ధమైన పూరిళ్లు

By

Published : May 2, 2020, 5:04 PM IST

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. ప్రధానంగా జియ్యమ్మవలస మండలం తురక నాయుడు వలస గ్రామంలో గాలుల ఉద్ధృతికి చెట్టుకొమ్మలు, ఇంటిపైకప్పుల రేకులు ఎగిరిపడ్డాయి. ఓ ఇంట్లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అరటి తోటల్లో చెట్లు నేలకూలాయి. అధికారులు స్పందించి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details