విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో.. ఎంపీటీసీ స్థానానికి పోలింగ్ ఆగిపోయింది. బ్యాలెట్ పేపర్‌లో తప్పులతో పోలింగ్ రేపటికి వాయిదా పడింది. పోటీలో ఉన్న అభ్యర్థి పేరుకు బదులుగా.. విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ముద్రణ అయ్యింది. వైకాపా అభ్యర్థి ఎస్.నిర్మల పేరు బదులుగా.. బ్యాలెట్ పేపరులో విత్‌డ్రా చేసుకున్న ఎస్.లక్ష్మి పేరు ముద్రించటంతో.. పోలింగ్ నిలిచిపోయింది.
రేపు రీపోలింగ్ నిర్వహణ: కలెక్టర్