Kotia villages Polling : విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మూల తాడివలసలో మొత్తం 382 ఓట్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు కేవలం 16 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. ఒడిశా నాయకులు ప్రలోభాలకు గురి చేసినా.. ప్రజలు ఓటు వేసేందుకు సుముఖత చూపటం లేదు. దొరల తాడివలసలో ఓటింగ్ బహిష్కరించి.. 'ఒడిశా వద్దు ఆంధ్ర ముద్దు' అంటూ గిరిజనులు నినాదాలు చేశారు.
Polling in Kotia villages: 'ఒడిశా వద్దు.. ఆంధ్ర ముద్దు' అంటున్న కొఠియా గ్రామ గిరిజనులు - విజయనగరం జిల్లా వార్తలు
Kotia villages Polling : విజయనగరం జిల్లా కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఒడిశా నాయకులు ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు ఓటు వేసేందుకు సుముఖత చూపటం లేదు. 'ఒడిశా వద్దు ఆంధ్ర ముద్దు' అంటూ గిరిజనులు నినాదాలు చేశారు.
Kothia villages Polling