విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని గిరిజన శిఖర గ్రామాల్లో 'గిరిజన బాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో.. పార్వతీపురం ఓఎస్డీ ఎన్. సూర్యచంద్ర రావు ఆధ్వర్యంలో.. పోలీసులు, గ్రామస్థుల సహకారంతో శ్రమదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగువ మెండంగి నుంచి.. తాడిపుట్టి గ్రామాల మధ్య సరైన రహదారి లేక.. వైద్య సహాయం పొందేందుకు కూడా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.
పోలీసుల గిరిజన బాట.. పలు గ్రామాలకు రహదారులు - విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాల్లో గిరిజనబాట తాజా వార్తలు
విజయనగరం జిల్లాలో ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో పార్వతీపురం ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో.. గిరిజనబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరిజన గ్రామస్థుల సహకారంతో.. శ్రమదానం చేసి రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టారు.
గిరిజన గ్రామాల్లో పోలీసుల గిరిజనబాట
ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ ఆర్ఐ నాగేశ్వర రావు, సాలూరు సీఐ అప్పల నాయుడు, మక్కువ ఎస్ఐ రాజేష్ మరియు ఎస్టీఎఫ్, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...