విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చైతన్య వర్మ అనే ఉద్యోగి విశాఖలో ఆత్మహత్యాయత్నం చేశాడు. నిన్న రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సాయిరాం డార్మెటరీలో బసచేసిన అతడు.. విషం కలుపుకున్న ఆహారాన్ని తినేశాడు. చైతన్య ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలిసిన అతడి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన మూడో పట్టణ పోలీసులు హుటాహుటిన అతడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేశారు. ఘటనా స్థలికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చైతన్య ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని.. ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.