విజయనగరం ప్రదీప్ నగర్లో కొనసాగుతోన్న క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై ఒకటో పట్టణ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు, విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి సహకారంతో... నెల రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అత్యాధునిక సాంకేతికతను వినియోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ మురళి తెలిపారు. వివిధ క్రికెట్ యాప్‌ల ద్వారా వంద రూపాయల నుంచి అయిదు వేల రూపాయల వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని నవరంగ్‌పూర్ వేదికగా ఈ వ్యవహారం జరుగుతోందని వెల్లడించారు. గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు మార్పిడి చేసుకుంటున్నారని చెప్పారు.
క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల ఆకస్మిక దాడి
విజయనగరంలోని బెట్టింగ్ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బెట్టింగ్‌కు ఉపయోగించే ఉపకరణాలు, చరవాణులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
ఈ దాడుల్లో బెట్టింగ్‌కు ఉపయోగించే ఉపకరణాలు, చరవాణులు, 2 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు కోటేశ్వరరావు, షేక్ రియాజ్, షాభిర్ ఖాన్, అలీ, జలీల్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు.
ఇదీచదవండి.