ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎక్సైజ్ అధికారుల దాడులు.. నాటు సారా స్వాధీనం - రేగడి నాటుసారా కేంద్రాల వార్తలు

విజయనగరం జిల్లాలో పలు చోట్ల నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారాతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు.

natusara
ఎక్సైజ్ అధికారుల దాడులు.. నాటు సారా స్వాధీనం

By

Published : Feb 23, 2021, 3:47 PM IST

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామ సమీపంలో 1100 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో పలుచోట్ల నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడిలో 1100 లీటర్ల నాటుసారాతో పాటు ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:వృద్ధురాలన్న కనికరం లేదు... బస్సులో నుంచి దించేసిన సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details