విజయనగరం జిల్లా చినమేరంగి గ్రామ శివారు మురుగు కాలువ గట్టు మీద గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ శివ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనలో బెల్లపు ఊటను ధ్వంసం చేసి, సారా బట్టి సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎవరైనా నాటు సారా తయారు చేసినా,అమ్మినా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు - విజయనగరం జిల్లా తాజా వార్తలు
అక్రమ నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
అక్రమ నాటుసారా కేంద్రాలు
TAGGED:
విజయనగరం జిల్లా తాజా వార్తలు