విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామ పరిధిలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ఖైనీ గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన పి. రమేష్ అనే వ్యక్తి నుంచి సుమారు 30 వేల రూపాయల విలువైన సరకును పట్టుకున్నామని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అక్రమంగా తరలిస్తున్న గుట్కా స్వాధీనం - viziangaram dst gutka news
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీ బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. సరకు సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాలాజీ రావు తెలిపారు.
police raids on gutka khine in viziangaram dst one arrested