విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామ శివారులో కాలువ గట్టు మీద నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసిన 2 వేల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామని చెప్పారు. యాభై లీటర్ల సారాను, ఏడు సారా బట్టి సామాన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా నాటుసారా తయారు చేసినా..అమ్మినా.. కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - chinamerangi latest news
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 2000 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.
సారా తయారీ కేంద్రాలపై దాడులు