ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళాజాతతో.. కరోనాపై అవగాహన - india fights against carona

విజయనగరం జిల్లాలో కరోనా నియంత్రణకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

vizianagaram
కరోనా పై అవగాహన కల్పిస్తున్న పోలీసు అధికారులు...

By

Published : Apr 30, 2020, 3:33 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో కరోనా నియంత్రణ చర్యలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏఎస్పీ బిందుమాధవి ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. పట్నంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద కళాకారుల ప్రదర్శన చేశారు. సామాజిక దూరం పాటిద్దాం కరోనాను నియంత్రిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీ బిందుమాధవి కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించారు. సీఐ దాశరధి, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details