విజయనగరం జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక పరేడ్ గ్రౌండ్లో పోలీసుల త్యాగాలను, దేశభక్తిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ ప్రతిష్టను పెంచే డైలాగ్స్, మిమిక్రీ, పాటలు, శాస్త్రీయ నృత్యాలు, స్కిట్లను ప్రదర్శించారు.
విజయనగరంలో ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు - Police sacrifices shown at the parade ground
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా పరేడ్ గ్రౌండ్లో పోలీసుల త్యాగాలను, దేశ భక్తిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు, పోలీసు ప్రత్యేక దళాల మధ్య జరిగే కాల్పులను డెమోగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి.సత్యన్నారాయణ రావు, 5వ బెటాలియన్ అదనపు కమాండెంట్ ఎమ్బివివి సత్యనారాయణ, విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ బి.మోహనరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, 5వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు, డి. వెంకటేశ్వరరావు, హిస్కీరాజు, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, 5వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఎస్పీ రమేష్ రెడ్డిని వరించిన ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు