విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురం పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్దుడిని భోగాపురం పీసీ శ్రీనివాసరావు ఎత్తుకొని, పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోవటానికి వచ్చిన ఓ చంటిబిడ్డతో వచ్చిన బాలింతను గమనించిన విజయనగరం రెండో పట్టణ పోలీస్స్టేషన్ మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి... ఆ బాబును ఎత్తుకొని ఆడించారు. ఇలా పలువురికి సహాయం చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
ఓటు వేసేందుకు అవస్థలు... సహాయం చేసిన పోలీసులు - elections in viziangaram district
పోలీసులంటే యూనిఫాం వేసుకొని గంభీరంగా ఉన్న రూపమే గుర్తుకు వస్తుంది. కానీ.. అంతకుమించిన మానవత్వం కూడా వారిలో ఉంటుందని విజయనగరం పోలీసులు నిరూపించారు. జిల్లాలో పరిషత్ ఎన్నికల సందర్భంగా.. ఓటు వేయలేక ఇబ్బందులు పడుతున్న పలువురికి వారు చేయూత అందించి శభాష్ అనిపించుకున్నారు.
ఓటు వేసేందుకు పలువురి అవస్థలు... సహాయం చేసిన పోలీసులు