విజయనగరం జిల్లా సాలూరు మండలంలో గిరి శిఖర గ్రామాలైన నేరెళ్ల వలస, దళాయి వలస, దూలి భద్ర, కుంభి మడ, మూల వలస వంటి గ్రామాల్లో గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన కామాక్షి అమ్మవారి ఆలయం పీఠాధిపతి సత్యనారాయణ మూర్తి సౌజన్యంతో నెలకు సరిపడా సరుకులను పోలీసులు అందజేశారు. రూ. 900 విలువ చేసే సరుకులను 500 గిరిజన కుటుంబాలకు ఇచ్చారు.
500 గిరిజన కుటుంబాలకు సరుకుల పంపిణీ - సాలూరులో కరోనా నియంత్రణ చర్యలు
సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో.. 500 గిరిజన కుటుంబాలకు కామాక్షి అమ్మవారి ఆలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గిరిజనులకు నిత్యావసరాలు అందజేస్తోన్న పోలీసులు